- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధునాతన సౌకర్యాలతో.. మోడల్ ఆటోనగర్
25 ఎకరాలల్లో రూ.15 కోట్లతో నిర్మాణం
త్వరలో నాలుగు వందల మంది మెకానిక్ లకు మంత్రి హరీష్ చేతుల మీదుగా పంపిణీ
దిశ, సిద్దిపేట ప్రతినిధి : వాహనాలకు సంబంధించిన అన్ని రిపేర్లు ఒకే చోట అందించేలా అత్యధునిక ఆటోనగర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డేంటింగ్, పెయింటింగ్, రెగ్జిన్ వర్క్స్, ఎలెక్ట్రిక్ వర్క్స్, పంక్చర్, రేడియటర్ ఇలా వాహనాలకు సంబంధించిన అన్ని రకాల రిపేర్లు ఒకే చోట లభించేలా మందపల్లి శివారు పారిశ్రామిక పార్క్ లో 25 ఎకరాల స్థలంలో రూ.15 కోట్లతో మోడల్ ఆటోనగర్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శ్రీకారం చుట్టారు.
సిద్దిపేట పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. పట్టణ శివారుల్లో ఉన్న మెకానిక్ షెడ్లు వద్ద ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో మెకానిక్ షెడ్ల వద్ద నిలిపి ఉంచి వాహనాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతోంది. సిద్దిపేటలో ఇప్పటికే పొన్నాల వద్ద ఒక ఆటోనగర్ ఉండగా, పెరిగిన అవసరాలకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలతో మరో మోడల్ ఆటోనగర్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు సంకల్పించారు.
ఆలోచన వచ్చిందే తడవు పట్టణ శివారు పారిశ్రామిక వాడలో 25 ఎకరాల్లో 400 మెకానిక్ షెడ్లు నిర్మించుకునేలా రూ.15 కోట్లతో విద్యుత్, విశాలమైన రోడ్లు, మంచి నీటి సౌకర్యాలతో మోడల్ ఆటోనగర్ నిర్మాణం చేపట్టారు. మోడల్ ఆటోనగర్ లోని ప్లాట్లను మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా త్వరలో మెకానిక్ లకు అందజేయనున్నారు.
మెకానిక్ ల మేలు కోసమే : మంత్రి హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రం కావడం.. రెండు జాతీయ రాహదారుల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మెకానిక్ ల మేలు కోసం మోడల్ ఆటోనగర్ ఏర్పాటు చేయబోతున్నాం. విశాలమైన రోడ్లు, మంచి నీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. మెకానిక్ లకు గొప్ప ఆస్తి ఇస్తున్న అనే సంతృప్తి ప్రభుత్వానికి ఉంది.
మంత్రి హరీష్ రావుకు రుణపడి ఉంటాం : ఆటోనగర్ అసోషియేషన్ ప్రతినిధులు
అత్యధునిక సౌకర్యాలతో మోడల్ ఆటోనగర్ నిర్మించడంతో పాటుగా ప్లాట్లను కేటాయిస్తున్నందుకు మంత్రి హరీష్ రావుకు రుణపడి ఉంటామని ఆటోనగర్ అసోసియేషన్ ప్రతినిధులు అసన్, ఆర్.కే నర్పింహులు తెలిపారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా అన్ని సౌకర్యాలతో ఆటోనగర్ సిద్దిపేట నిర్మాణం కావడం సంతోషంగా ఉందన్నారు. ఆటోనగర్ అసోసియేషన్, కార్మికుల పక్షాన వారు మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.