- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లిక్కర్ కుంభకోణంలో ఎందుకు తలదూర్చావు ‘చెల్లె కవిత’: ఎమ్మెల్యే రఘునందన్ రావు
దిశ, దుబ్బాక: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కపోయిన చెల్లెమ్మ కవిత.. తెలంగాణ ఆడపడుచులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ మరో తప్పు చేయోద్దని ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు సూచించారు.బుధవారం పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్, భారత రాష్ట్రపతి ప్రసంగం వర్క్ షాప్ అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అవినీతి చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని విమర్శించిన వాళ్లకు చెల్లె కవితకిచ్చిన ఈడీ నోటీసులే సమాధానం చెబుతాయన్నారు.
అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న కవిత తెలంగాణ ఆడపడుచులకు రుద్దడం బాధాకరమన్నారు. తెలంగాణ మహిళా లోకానికి ఆదర్శంగా ఉండాల్సిన చెల్లెమ్మ కవిత లిక్కర్ కుంభకోణంలో తలదూర్చి స్వచ్ఛమైన తెలుగింటి ఆడపడుచుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. తెలంగాణాలో దోచుకుంది సరిపోక ఢిల్లీ వెళ్లి లిక్కర్ స్కామ్ లో వచ్చిన ఆదాయాన్ని ఎందుకు పెంచుకున్నావో మహిళా లోకానికి సమాధానం చెప్పాలన్నారు. కవితకు నోటీసులిచ్చింది మోదీ కాదని ఈడీ ఇచ్చిందని బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలని సూచించారు.
ఈడీ నోటీసులిస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని ప్రగల్భాలు పలికి ఇప్పుడేమో తెలంగాణ సామాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావా అని ప్రశ్నించారు. గతంలో కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా తనలాగే తప్పించుకుందామని ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పలేదని, చట్టం ఎవరి చుట్టం కాదన్న విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని సూచించారు. చెల్లె కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టమని అడిగిన సందర్భం ఉందా.. ఇప్పుడేమో ఢిల్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని దొంగ దీక్షలకు పూనుకుంటుందని ఆరోపించారు.
తెలంగాణలో మహిళల నిష్పత్తి ప్రకారం మంత్రి పదవులు ఇవ్వమని సీఎం కేసీఆర్ ను ఎప్పుడైనా అడిగిందా కవితా అని ఎద్దేవా చేశారు. లిక్కర్ కుంభకోణంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడాని రాస్తారోకోలు, బంద్ లు, ధర్నాలు, దీక్షలు చేయడమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ ఎస్.ఎన్ చారి, జిల్లా కార్యదర్శి కిష్టమ్మ గారి సుభాష్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం ఇన్ చార్జి విస్తరక్ ఋషి, పన్న ప్రముఖులు ఇన్ చార్జి, పాలక్ ఇన్ చార్జి అంజిరెడ్డి, బూత్ స్థాయి పన్న ప్రముఖులు, శక్తి కేంద్రం ఇన్ చార్జిలు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకోజి ప్రవీణ్, దూలం వెంకట్ గౌడ్, పుట్ట వంశి, మచ్చ శ్రీనివాస్, రమేష్ రెడ్డి, మండల బీజేపీ నాయకులు, కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.