మంత్రి Satyavati Rathod రాకను అడ్డుకుంటాం.. బానోత్ సంతోష్ నాయక్

by Sumithra |   ( Updated:2023-10-03 18:19:55.0  )
మంత్రి Satyavati Rathod రాకను అడ్డుకుంటాం.. బానోత్ సంతోష్ నాయక్
X

దిశ, అక్కన్నపేట : తెలంగాణ రాష్ట్ర గిరిజనాభివ్రుద్ది, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అక్కన్న పేటలో బుధవారం పర్యటించనున్నారు. కాగా ఈ పర్యాటనను అడ్డుకుంటామని కపూర్ నాయక్ గ్రామసర్పంచ్ బానోత్ సంతోష్ నాయక్ ఒక పత్రిక ప్రకటనలో స్పష్టం చేశారు. స్థానిక అదికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు ప్రచార ఆర్భాటాలకు ఇచ్చే ప్రాధాన్యత, ప్రజాసమస్యల పరిష్కారానికి చూపడంలేదని ఎండగట్టారు. ఒకవైపు గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. మరోవైపు మండలంలోని నందారం, కపూర్ నాయక్ తండా గ్రామాల పరిధిలో సుమారు 932 ఎకరాల వ్యవసాయ భూములను ధరణి పోర్టల్ లో నిషేదిత జాబితాలో చేర్చి, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా స్పష్టమైన వైఖరితో తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం అక్కన్న పేట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.

లేనియెడల మంత్రి రాకను ద్రుష్టిలో పెట్టుకొని ప్రజా అసంతృప్తి సెగ ఎలా ఉంటుందో చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. తూతూ మంత్రంగా చాలిచాలని నిధులను విడుదల చేసి, అదేదో అక్కన్న మండలానికి గొప్పగా చేశామని చంకలు గుద్దుకోవడాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండిస్తూ, సంఘటితంగా మంత్రి రాథోడ్ రాకను అడ్డకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ముందుకు రావాలని కోరారు. హుస్నాబాద్ ప్రాంతంలో ఏ ఒక్క గిరిజన ఎంపీపీ జడ్పీటీసీ గిరిజన తండాలో నివాసం ఉంటున్నారు, తెలియజేయాలని ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి సంతోష్ నాయక్ అన్నారు. గిరిజన తండాలో ఉండకుండా హుస్నాబాద్ లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారన్నారు. అక్కన్నపేట పరిధిలోని గిరిజన తండాల్లో కనీస సౌకర్యాలు లేక తాగడానికి నీళ్లు లేక ఉండడానికి ఇల్లు లేక గిరిజలంతా సతమతమవుతున్నారని మేము ఓట్లు వేసి గెలిపించిన ప్రజాపతినిధులు గిరిజన తండాల్లో కాకుండా హుస్నాబాద్ లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed