విజయభేరి సభను విజయవంతం చేయాలి

by Naresh |   ( Updated:2023-09-16 10:01:14.0  )
విజయభేరి సభను విజయవంతం చేయాలి
X

దిశ, మెదక్ టౌన్: తుక్కుగుడాలో నిర్వహిస్తున్న సోనియా సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని మెదక్ నియోజక వర్గ ఇంచార్జ్ ఇంద్ర కరణ్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో శనివారం జిల్లా అధ్యక్షుడు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా కరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చడంలో విఫలమైందన్నారు. డబుల్ బెడ్ రూమ్ విషయంలో కొన్ని గ్రామాల్లో ఇచ్చి, మరికొన్ని గ్రామాల్లో శిథిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయని విమర్శించారు. గృహలక్ష్మి పేరుతో సొంత స్థలాలు ఉన్నవారికి ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి ఇప్పటికీ చాలా రోజులు గడుస్తున్నా అమలు కాకపోవడం బాధాకరమన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ ప్రజలను తెలియజేసేందుకు తుక్కుగుడా లో విజయభేరి సభ నిర్వహిస్తున్నట్ల తెలిపారు. ఈ సభకు నియోజకవర్గం నుండి దాదాపు పదివేల మంది బయలుదేరినట్లు వారు తెలిపారు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు అంశాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మామిడ్ల ఆంజనేయులు, కిషన్ సేల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గూడూరి ఆంజనేయులు, మండల అధ్యక్షులు లక్కరి శ్రీనివాస్, మండల కిసాన్ సేల్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, శ్యామ్ సుందర్, మొండి పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story