- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మెదక్ > తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక ఉర్సు ఉత్సవాలు: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక ఉర్సు ఉత్సవాలు: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
X
దిశ, పటాన్ చెరు: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఉర్సు ఉత్సవాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణ పరిధిలోని హజ్రత్ సయ్యద్ మురాధ్ అలీ షా దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హిందూ ముస్లిం భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉర్సు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం దర్గా కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, ముస్లిం మత పెద్దలు లియాకత్ అలీ, నాయకులు అజ్మత్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story