భారీ వర్షం.. కోహెడ మండల కేంద్రంకు రాకపోకలు బంద్

by Mahesh |
భారీ వర్షం.. కోహెడ మండల కేంద్రంకు రాకపోకలు బంద్
X

దిశ, కోహెడ: గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో చెరువులు కాలువలు నుంచి వస్తున్న వరద నీటితో కోహెడ బదుగుల చెరువు అలుగు పోస్తుంది. కోహెడ బదుగుల చెరువు అలుగు పోయడం వలన ఉదయం ఐదు గంటలకు కాలనీలో ఇళ్లలోకి నీరు దుకాణాల్లోకి నీరు చేరి వ్యాపారస్తుల వృత్తిపరమైన సామాగ్రి మునిగిపోవడం జరిగింది. రోడ్డుమీద నీరు ప్రవహిస్తూ కోహెడ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం నీళ్ల చెరువు లాగా కనిపిస్తుంది. రోడ్డుమీద ఉన్న నీరు వెళ్లడానికి కోసం జెసిబి సహాయంతో రోడ్డుకు పక్కన కాలువ తీయడం జరిగింది. కోహెడ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్ నుంచి కోహెడ వచ్చే దారి ఇందుర్తి దగ్గర ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది అలాగే వింజపల్లి దగ్గర పిల్లవాగు ఉధృతంగా పోతుంది. శనిగరం నుండి కోహెడకు వచ్చే రహదారిలో మోయ తుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహించడం వలన రాకపోకలు నిలిచిపోయాయి.కోహెడ చుట్టూ ఉన్న వాగులు ఉదృతంగా ప్రవహించడం వలన కోహెడకు రాకపోకలు నిలిచిపోయినాయి. కోహెడ మండలం ఎంపీడీవో కృష్ణయ్య, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed