- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టౌన్ మెప్మా కో ఆర్డినేటర్ విధుల నుంచి తొలగించాలి.. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఆర్పీలతో అసభ్యంగా మాట్లాడిన టౌన్ మెప్మా కో ఆర్డినేటర్ సాయి కృష్ణని విధుల్లోంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సదరు ఉద్యోగి అనుచిత ప్రవర్తన పై ఆర్పీలు ఫిర్యాదు చేసిన మున్సిపాల్ చైర్ పర్సన్ చర్యలు తీసుకోక పోవడం సిగ్గు చేటన్నారు.
మహిళలతో అసభ్యంగా మాట్లాడిన టౌన్ మెప్మాకో అర్డినేటర్ పై చర్యలు తీసుకోని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో మాజీమున్సిపాల్ చైర్మన్ రాజనర్సు సదరు ఉద్యోగికి వతాసు పలుకడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గయాజుద్దీన్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ బైరి సాయి, మైనార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఫయాజ్ ఎన్ఎస్యూఐ నాయకులు రాకేష్, అనిల్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.