భళా చేనేత హస్తకళా భళా...

by Sumithra |
భళా చేనేత హస్తకళా భళా...
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ : సంగారెడ్డిలోని తిరుమల తిరపతి దేవస్థానం (టీటీడీ)లో గత 10 రోజులుగా అఖిల భారత చేనేత హస్తకళా మేళ నిర్వాహకులు ప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. ఈ చేనేత హస్తకళా మేళ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి అనేక కళాకారులు తయారు చేసిన వస్తువులు, చేనేత వస్త్రాలు సరసమైన ధరలకు ప్రజలకు అమ్మకాలు చెస్తున్నారు.

కాగా ఈ మేళాలో పోచంపల్లి శారీస్, బెడ్ షీట్లు, డ్రెస్ మెటీరియల్స్, గద్వాల్, నారాయణ పేట హాండ్లూమ్స్, మంగళగిరి చీరలు, కాటన్, పట్టు చీరలు, వరంగల్ టవల్స్, కలంకారి శారీస్, డ్రెస్ మెటీరియల్స్, ఇంతే కాక కొండపల్లి బొమ్మలు, మైసూర్ శాండల్ వుడ్, రోజ్ వుడ్ పాన్నెల్స్, వరంగల్ లెదర్స్, బంజారా ఎంబ్రాయిడరీ, హైదరాబాద్ పెరల్స్, బాంగిల్స్, వుడెన్ ఐటమ్స్, బ్లాక్ మెటల్స్, ఇంటి అలంకరణ వస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందుబాటులో ఉన్నట్టు నిర్వాహకుడు ప్రసాద్ తెలిపారు. ఈ చేనేత హస్తకళా మేళ ఇంకా 15 రోజులు కొనసాగుతుందని ప్రజలు ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Next Story