దేశానికే ఆదర్శం 'కంటి వెలుగు': వంటేరు ప్రతాప్ రెడ్డి

by Kalyani |
దేశానికే ఆదర్శం కంటి వెలుగు: వంటేరు ప్రతాప్ రెడ్డి
X

దిశ, ములుగు: కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీపీ పాండు గౌడ్, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, సర్పంచ్ మంజుల శ్రీరాములుతో కలిసి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.18 సంవత్సరాలు పైబడిన కంటి చూపు సమస్య ఉన్నవారు ప్రభుత్వం నిర్వహించిన వైద్య శిబిరాల్లో ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరేందర్, ఉపసర్పంచ్ మహేష్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story