- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీని కాపాడిన గన్‌మెన్ కు వెల్లువెత్తుతున్న ప్రశంసలు
దిశ, కంది : అతను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ కు వ్యక్తిగత గన్ మెన్. ప్రాణాలకు తెగించి తన డ్యూటీని నిర్వర్తించి ఎంపీని సాహసోపేతంగా కాపాడాడు. అతనే ఎఆర్‌హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్. ఈ నెల 30న మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటల ప్రాంతంలో దౌల్తాబాద్ మండలం, సూరంపల్లి గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ అనంతరం సూరంపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పరామర్శించి వస్తుండగా ఎంపీ తన కారు వద్దకు చేరుకోగానే ఒక అనుమానాస్పద వ్యక్తి ఎంపీ పై కత్తితో దాడికి యత్నించి పొట్ట భాగంలో పొడిచాడు. పక్కన ఉన్న గన్ మెన్ అయిన ప్రభాకర్ వెంటనే స్పందించి నిందితుడి చేతిలో ఉన్న కత్తిని లాగేసుకున్నాడు. ఈ క్రమంలో గన్ మెన్ అయిన ప్రభాకర్ కు చేయి వేలు భాగంలో కోసుకుపోయింది. వెంటనే దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని, గాయపడిన ఎంపీ ని ప్రథమ చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి. అనంతరం మెరుగైన చికిత్స కోసం యశోద హాస్పిటల్ హైదరాబాద్ కు పంపించిన విషయం తెలిసిందే.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్ ను సీఎం కేసీఆర్ పరామర్శించేందుకు వచ్చారు. అక్కడే ఎదురుగా నిల్చున్న గన్ మెన్ ప్రభాకర్ ను సీఎం చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఈనెల 31న జిల్లా ఎస్పీ రూపేష్ గన్ మెన్ ప్రభాకర్ తో పాటు మరో ఏఆర్ కానిస్టేబుల్ గంగారం లను అభినందించి రివార్డు అందజేశారు. పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ తక్షణమే స్పందించడం వలన ఎంపీని ప్రాణపాయస్థితి నుంచి కాపాడటం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా వీఐపీ సెక్యూరిటీ పట్ల ఇలాగే డ్యూటీ చేయాలని జిల్లా ఎస్పీ అన్నారు.