- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు హల్..చల్
దిశ, దుబ్బాక :వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ రైతు హల్.. చల్ చేసిన ఘటన దుబ్బాక మండలం శిలాజీ నగర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.. తమ గ్రామానికి చెందిన పెద్ద మనుషులు చేసిన భూ పంచోటి పత్రాలు ఇవ్వాలని నిరసిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ రైతు హల్..చల్ చేశాడు. శిలాజీ నగర్ గ్రామానికి చెందిన పెంబర్తి కనకయ్యకు ఎకరం భూమి విషయంలో గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది.
ఇటీవల గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషుల సమక్షంలో భూవివాదం పరిష్కారమైంది. పరిష్కారమైన భూపంచోటి పత్రాలను గ్రామ సర్పంచ్ మాడురి శ్రీనివాస్ వద్ద ఉంచారు. సర్పంచ్ వద్ద ఉన్న పత్రాల్లో ఓ జీరాక్స్ కాఫీని తనకు ఇవ్వాలంటూ కనకయ్య సర్పంచ్ ను పలుమార్లు అడిగినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు కనకయ్య గురువారం గ్రామంలోని వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని అరిచాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు దుబ్బాక పోలీసులకు సమాచారం అందజేశారు. కనకయ్య సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో అతడిని కిందకు దింపి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పోలీసులు సముదాయించడంతో కనకయ్య రాజీ పడ్డాడు.