- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
దిశ, మెదక్ ప్రతినిధి : జిల్లాను క్రీడల్లో ప్రథమ స్థానంలో నిలిపేలా క్రీడాకారులు కృషి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్ బాల్ జట్టును అభినందించారు. జిల్లా తెలంగాణ ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుండి 20వ తేదీ వరకు నిజాంబాద్ లో జరిగిన రాష్ట్రస్థాయి మహిళల ఫుట్ బాల్ ఛాంపియన్షిప్ లో రన్నరప్‌గా నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా జట్టును జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తన చాంబర్లో క్రీడాకారులను, వీరితోపాటు జాతీయస్థాయిలో జూనియర్ ఫుట్బాల్ విభాగంలో
బంగారు పతకం సాధించిన అంకిత్ ను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యం కల్పిస్తుంది అన్నారు. మెదక్ లోని ఇందిరాగాంధీ స్టేడియం మరమ్మతులను ఇప్పటికే పూర్తి చేసి ఫుట్ బాల్ క్రీడా మైదానాన్ని క్రీడాకారులకు అందుబాటులో తీసుకొచ్చామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయస్థాయిలో రాణించాలన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సంయుక్త కార్యదర్శి నగేష్, శిక్షకులు ప్రకాష్, భాగ్యమ్మ, వినయ్, బాణి, ఫుట్ బాల్ అకాడమీ సభ్యులందరినీ కలెక్టర్ అభినందించారు.