జాతీయ బాల్ బ్యాడ్మింటన్ లో రాణించిన తెలంగాణ జట్టు

by Kalyani |   ( Updated:2023-02-21 09:22:19.0  )
జాతీయ బాల్ బ్యాడ్మింటన్ లో రాణించిన తెలంగాణ జట్టు
X

దిశ, మిరుదొడ్డి: ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లోని ప్రగతి గ్రౌండ్ లో నిర్వహించిన 41 వ సబ్ జూనియర్ జాతీయ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. అద్భుతమైన ఆట తీరుతో రాణించి జాతీయ స్థాయిలో నాలుగవ స్థానం కైవసం చేసుకున్నారు. గతంలో సబ్ జూనియర్ జట్టు ఆశించిన ఫలితాలు రాబట్టలేదు. ఈ సారి మంచి ప్రతిభని కనబరిచి నాలుగవ స్థానంలో నిలవడం హర్షనీయం అని తెలంగాణ రాష్ట్ర బాల్-బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస రావు తెలిపారు.

రాష్ట్ర జట్టులో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన వేముల సిద్ధార్థను ఈ సందర్బంగా అభినందించి ప్రశంసపత్రం అందించారు. జిల్లాకు చెందిన క్రీడాకారుడు రాణించడం పట్ల రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ చీఫ్ ప్యాట్రన్స్ మనోహర్ రావు, శ్రీనివాసరావు, మెదక్ జిల్లా బాల్-బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ పీవీ. రమణ, మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గొట్టం భైరయ్యలు సిద్ధార్థను అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed