తెలంగాణ అంటేనే త్యాగధనుల చరిత్ర

by Sridhar Babu |
తెలంగాణ అంటేనే త్యాగధనుల చరిత్ర
X

దిశ, మెదక్ ప్రతినిధి : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మొత్తం త్యాగధనుల చరిత్ర అని, ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించేతత్వం అలవడిందన్నారు. నిజాం నిరంకుశ పాలనలో శిథిలమైపోయిన బతుకులను బాగు చేయడానికి పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు.

ఆనాడు బహుజనుల కోసం పోరాటం చేసిన ఆ మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు పంచాలని కోరారు. ఆమె స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టినట్టు తెలిపారు. ఇందుకు గాను రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు రోహిత్ రావు, సునీతాలక్ష్మారెడ్డి, ఎంఎల్ సీలు శేరి సుభాష్ రెడ్డి, యాదవరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed