- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఆవిర్బావ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి..
దిశ, సంగారెడ్డి : జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జూన్, 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లను పూర్తిచేశారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముస్తాబు చేశారు. 2న హోంమంత్రి మహమూద్ అలీ వేడుకలను ప్రారంభించనున్నారు. వేసవి కాలం ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు వచ్చే అతిథులకు శామియానాలు ఏర్పాటు చేశారు. మంత్రి ప్రసంగించేందుకు వీలుగా టెంటు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు స్టేజీ ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్..
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను కలెక్టర్ శరత్ పరిశీలించారు. ఆయా ఏర్పాట్ల విషయమై పలుసూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. ముఖ్య అతిథికి, ఆహుతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ నగేష్, ఏఓ మహిపాల్ రెడ్డి , తదితరులు ఉన్నారు.