- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడే టేక్మాల్ సొసైటీ అవిశ్వాస పరీక్ష.. చైర్మన్ రేస్‌లో ముగ్గురు డైరెక్టర్‌లు
దిశ,ఆందోల్: మెదక్ జిల్లా టేక్మాల్ సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాస పరీక్షను నేడు (గురువారం) పెట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3వ తేదీన టెక్మా ల్ సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానం పత్రాన్ని సభ్యులు జిల్లా సొసైటీ అధికారి కరుణకు అందజేశారు. ఈ విషయమై సొసైటీ అధికారులు ఈనెల 25న (నేడు గురువారం) అవిశ్వాస పరీక్ష నిర్వహించేందుకు డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. టేక్మాల్ సొసైటీలో 13 మంది సభ్యులు ఉండగా, బీఆర్ ఎస్ పార్టీ మద్దతుతో 8 మంది, కాంగ్రెస్ మద్దతుతో 5 మంది డైరెక్టర్లుగా ఎన్నిక కావడంతో, చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.
వీరిలో ఒకరు మృతి చెందగా, ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సంఖ్య ఏడుగురు చేరగా, మరొక బీఆర్ ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్ మద్దతుతో మొత్తం 8 మంది సభ్యులు ప్రస్తుత పాలవర్గంపై అవిశ్వాసం పెట్టారు. గురువారం ఉదయం 11 గంటలకు టేక్మాల్ లోని సొసైటీ కార్యాలయంలో అవిశ్వాస పరీక్ష జరగనుంది. ఈ అవిశ్వాస పరీక్షలో ప్రస్తుత చైర్మన్ గా ఉన్న యశ్వంత్ రెడ్డి నెగ్గుతారా? లేక నూతన కమిటీ ఎన్నిక అవుతుందా అన్నది నేటితో తేలనుంది.
చైర్మన్ రేసులో వీరే..
టేక్మాల్ సొసైటీ అవిశ్వాస పరీక్ష నేటితో తెలనుండడంతో చైర్మన్ ఎవరవుతారన్నది ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో ఆ పార్టీకి చెందిన డైరెక్టర్లు పాల్వంచ గ్రామానికి చెందిన పులి సత్యనారాయణ, ధనుర గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, టేక్మాల్ కు చెందిన పాపయ్యలు పోటీ పడుతున్నట్టు సమాచారం. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించనుండడంతో వారిలో ఎవరికి దక్కుతుందో నన్న ఆసక్తి నెలకొంది. మంత్రి ఆశీస్సుల కోసం వీరిలో ఎవరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
క్యాంపులో డైరెక్టర్లు..
టేక్మాల్ సొసైటీ అవిశ్వాసం పెట్టిన ఎనిమిది మంది డైరెక్టర్లు గత మూడు రోజులుగా క్యాంపుకు వెళ్లారు. ఈనెల 25వ తేదీన అవిశ్వాస పరీక్ష ఉండడంతో డైరెక్టర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ముందు జాగ్రత్త చర్యగా క్యాంపుకు తీసుకెళ్లినట్లు సమాచారం. వీరంతా అవిశ్వాస పరీక్ష సమయానికి సొసైటీ కార్యాలయానికి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది.