- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజయవంతంగా కొనసాగుతున్న 'కంటి వెలుగు': మంత్రి హరీష్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 26వ వార్డులో కంటి వెలుగు వైద్య శిబిరాన్ని మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తులో ఐ స్కానింగ్ క్యాంపులు నిర్వహించలేదన్నారు. సీఎం కేసీఆర్ ఖమ్మంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన 25 రోజుల్లో 50లక్షల మార్క్ చేరుకోవడం రికార్డు అన్నారు. కంటి వెలుగుకు ప్రజల్లో వస్తున్న ఆదరణకు ఇదే నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వైద్య శిబిరాల్లో 23 లక్షల మంది పురుషులు, 26 లక్షల మంది స్త్రీలు, 7వందల మంది ట్రాన్స్ జెండర్లు పరీక్షలు చేయించుకున్నారని చెప్పారు. 16లక్షల మంది కంటి చూపు సమస్యలతో బాధ పడుతున్నట్లు గుర్తించారన్నారు.
9లక్షల 36వేల మందికి రీడింగ్ గ్లాసులు అక్కడికక్కడే పంపిణీ చేశామని, 6లక్షల 50వేల మందికి ప్రిస్కిప్షన్ గ్లాసులను పరీక్షించిన 2 వారాల్లో ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మాజీ మున్సిపాల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, డీఎంహెచ్ వో కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.