- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SP Chennuri Rupesh : విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి
దిశ, సంగారెడ్డి : ర్యాగింగ్ అనేది చట్టరిత్యా నేరం అని ఎవరైనా ర్యాగింగ్ కు (Raging) పాల్పడినట్లైతే శిక్షార్హులు అవుతారన్నారని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ (SP Chennuri Rupesh) అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ సెన్సిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొంత మంది విద్యార్ధులు ర్యాగింగ్ చేస్తూ, ఇతర విద్యార్ధులను ఇబ్బందులకు గురిచేసి, ఆనందిస్తున్నారని, అలాంటి వారి సమాచారాన్ని నిర్భయంగా జిల్లా పోలీస్ షీ-టీం నెంబర్ 8712656772, ఎస్ న్యాబ్ 8712656777 లేదా డయల్ 100 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖ ఉక్కుపాదం మోపడం జరుగుతుందని, మాదకద్రవ్యాల ఉనికి లేకుండా చేయడానికి జిల్లాలో ప్రత్యేకంగా నార్కోటిక్ అనాలసిస్ బ్రాంచ్ ను ఏర్పాటు చేసి, విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించడం జరుగుతుందన్నారు. గంజాయి, గుట్కా, సిగరెట్ వంటి ఇతర మత్తు పదార్ధాలకు బానిసలైతే, మత్తులో జీవితాలు చిత్తు అవుతాయన్నారు. విద్యార్ధిని, విద్యార్థులు మొదటగా చదువు పై దృష్టి సారించాలని, అనవసర సరదాలకు పోయి, కష్టాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు.
మీ తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, కష్టపడి చదివి భవిష్యత్తులో ఉత్తమ డాక్టర్లుగా ఎదగాలని సూచించారు. ర్యాగింగ్, ఈవ్ టీసింగ్, గంజాయి వంటి ఇతర మాదకద్రవ్యాల జోలికి వెళ్లి చట్టం ముందు దోషులుగా నిలుబడవద్దన్నారు. విద్యార్థులు నూతన చట్టాల గురించి అవగాహన కలిగి, చట్టాలకు లోబడి ఉండాలని మెడికోలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుధామాధురి, సూపరింటెండెంట్ డా.అనిల్ కుమార్, మెడికల్ కళాశాల ప్రొఫెసర్స్, విద్యార్థిని విద్యార్ధులు పాల్గొన్నారు.