- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా..
దిశ, చేగుంట: రహదారిపై వస్తున్న ఆటోకు కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడ్డ ఘటన మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని బోనాల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేష్ తన ఆటోలో నలుగురు ప్రయాణికులను ఎక్కించుకుని చేగుంట వైపు వస్తుండగా రుక్మాపూర్ పెద్దమ్మ గుడి వద్ద కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కొండాపూర్ గ్రామానికి చెందిన సౌందర్య, ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య, బోనాల గ్రామానికి చెందిన మురారి దుర్గయ్య, కొండాపూర్‌కు చెందిన రామ్ము లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ నరేష్ తీవ్ర గాయాలు పాలు చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే..
తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆటో ప్రమాద బాధితులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లను ఆదేశించారు. ఆటో ప్రమాదంలో గాయపడి వారిని ఇబ్రహీంపూర్ మాజీ సర్పంచ్ నాగబూషణం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా డాక్టర్లను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించాల్సిందిగా డాక్టర్లను కోరారు. వారికి వైద్య ఖర్చుల నిమిత్తం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తక్షణ ఆర్థిక సహాయం చేశారు. చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.