సింగూరు నీరు విడుదల

by Shiva |
సింగూరు నీరు విడుదల
X

దిశ, చౌపకూర్: మండల పరిధిలోని మంజీరా బ్యారేజ్ ప్రాజెక్టు నుంచి వరి సాగు కోసం దిగువనున్న ఘణపురం ఆయకట్ట కట్టు రైతులకు బుధవారం రాత్రి 8 గంటలకు 30 వేల క్యూసెక్కుల నీటిని వదలనున్నట్లు చౌటకూర్ తాసిల్దార్ కిష్టయ్య తెలిపారు. కావున రైతులు యాసంగిలో సాగుచేసిన పంటలకు ఎన్ని కష్టాలు వచ్చినా సింగూరు నీటిని అందిస్తామని ఆయన తెలిపారు. రైతులు ఎటువంటి అపోహాలకు గురికావొద్దని ఆయన సూచించారు.

వరి పొట్ట దశలో ఉన్నందున ఎక్కువగా పంట నీరు తాగే అవకాశం ఉందని దాని కోసమే ఈ నీటిని విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతే కాకుండా సింగూరు ఎడమ కాలువ ద్వారా సుమారు 40,000 ఎకరాలకు నీరు అందిస్తున్నామన్నారు. కావున మత్స్యకారులు, పశువుల కాపరులు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed