- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Siddipet Collector: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతం చేయాలి
దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిల్లా యంత్రాంగం సమన్వయంతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి Siddipet Collector అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు(MPDO), మండల స్థాయి ట్రైనర్ లకు ఇంటింటి కుటుంబ సర్వే గురించి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు అవసరమైన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ లను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ అందించేందుకు నియోజకవర్గానికి ఒకరు చొప్పున మాస్టర్ ట్రైనర్ ని కేటాయించడం జరిగిందన్నారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యుమరేటర్ ఉండేలా ఎన్యూమరేటర్ బ్లాక్ మ్యాప్ లను అప్ డేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మాస్టర్ ట్రైనర్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్ర సర్వేలోని ప్రశ్నలు సమాధానాల గురించి ఇతరత్రా పూర్తి విషయాల గురించి క్లుప్తంగా వివరించారు.