- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా, భూకబ్జాలు : బీఎస్పీ
దిశ, వెల్దుర్తి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక మాఫియా భూ కబ్జాలు పెరిగాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నర్సింహులు అన్నారు. శుక్రవారం వెల్దుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే దళిత బంధు, బీసీ బంధు, ఎలక్షన్ స్టంట్ మాత్రమే అన్నారు. ప్రభుత్వ పథకాలు స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అనుచరులకి అందాయని విమర్శించారు. వెల్దుర్తి నుండి గుమ్మడిదల వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉందని వ్యాపార రాకపోకలు చేసేవారు రాత్రి వేళల్లో ప్రమాదాలకు గురవుతున్నారని బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 11 సంవత్సరాలు అవుతున్న రోడ్డును పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. నీళ్లు నిధులు నియమకాలు అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం తన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షుడు జనార్ధన్ గౌడ్, నియోజకవర్గం ఇంచార్జ్ నరేంద్ర గౌడ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సారా రవి గౌడ్, మహిళా విభాగం కన్వీనర్ రాణిలు పాల్గొన్నారు.