- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యం వెంటనే దింపుకోవాలి : కలెక్టర్ డాక్టర్ శరత్
దిశ, సంగారెడ్డి : రైస్ మిల్లర్లు లక్ష్యం మేరకు ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ధాన్యం తరలింపు, అన్లోడ్ చేసుకోవడం తదితర అంశాల పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు ధాన్యాన్ని వెంటనే దింపుకోవాలన్నారు. ధాన్యం లారీలు దింపుకోని వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్ఓను ఆదేశించారు.
ధాన్యం సకాలంలో దించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకుని ధాన్యం లారీలు వచ్చిన వెంటవెంటనే అన్లోడ్ చేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలోనూ సీరియల్ నంబర్ పాటించాలని, ఎవరు మొదటగా కాంటా వేస్తారో వారివి మొదటగా లోడ్ చేసి రైస్ మిల్లులకు పంపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి రైస్ మిల్లు వద్ద దశాబ్ది ఉత్సవాల ఫ్లెక్సీ, పోస్టర్ను ప్రదర్శించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వనజాత, డీఎం సుగుణ బాయ్, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.