- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస
దిశ, హత్నూర : కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం స్థానిక రైతు వేదిక భవనంలో పంపిణీ చేశారు. చెక్కులు పంపిణీ చేస్తున్న క్రమంలో పదవిలో లేకున్నా బీఆర్ఎస్ నాయకులు స్టేజీ పైన కూర్చున్నారు. దీంతో భాజపా నాయకులు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కు, కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వలేదని అధికారులను నిలదీశారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో అధికారంలో లేని ప్రజాప్రతినిధులు స్టేజీపైన కూర్చోవడం ఆనవాయితీగా మారిందని అన్నారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకొని స్టేజీపైన ఉన్న బీఆర్ఎస్ నాయకులను కిందికి పంపించారు . ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతున్నా మూడు పార్టీల వారు ఎవరికివారుగా నినాదాలు చేయడంతో గందరగోళం మధ్యనే చెక్కుల పంపిణీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పర్వీన్ షేక్, ఎంపీడీవో శంకర్, వివిధ గ్రామాల లబ్ధిదారులు , మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
- Tags
- Protocol