- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు ప్రజలు సహకరించాలి : కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన ను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే సమయంలో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఇంటి యజమానులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. 8 తేదీ వరకు హౌస్ సర్వే నిర్వహించి యజమానుల పేర్లను నమోదు చేసి ఇంటింటికీ స్టిక్కర్ అతికించడం జరుగుతుందన్నారు. 9వ తేదీ నుంచి ప్రభుత్వం రూపొందించిన నిర్దిష్టమైన ఫారం లో ఇంటిలోని ప్రతి ఒక్కరి సమగ్ర సామాజిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ కుల గణన నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్ల కు ప్రజలు సంపూర్ణ సమాచారాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించాలని అన్నారు. ఇంటింటి సర్వే చేసేందుకు జిల్లాలలో 2538 మంది ఎన్యూమరేటర్లను, 252 మంది సూపర్ వైజర్ల ను నియమించడం జరిగిందన్నారు. సర్వే ను పర్యవేక్షించేందుకు మండల స్థాయిలో తాసిల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గంలో స్థాయిలో ప్రత్యేక అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలు, జిల్లా ఓవరాల్ గా జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఏ రోజుకారోజు సర్వే వివరాలను ఆన్ లైన్ లో పొందుపరచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ తహసీల్దార్ వెంకట్ రెడ్డి, సర్వే సూపర్వైజర్, ఎన్యూమరేటర్ ఉన్నారు.