Collector Rahul Raj : చెట్టు లేకపోతే జీవనమే లేదు.. కలెక్టర్ రాహుల్ రాజ్..

by Sumithra |
Collector Rahul Raj : చెట్టు లేకపోతే జీవనమే లేదు.. కలెక్టర్ రాహుల్ రాజ్..
X

దిశ, నిజాంపేట : మానవ మనుగడకు చెట్లే ప్రాధాన్యమని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ మేరకు రామాయంపేట మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రాంగణంలో అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలను ఆయన నాటారు. మొక్కలు నాటడానికి వచ్చిన జిల్లా కలెక్టర్కు విద్యార్థులు స్వాగత ర్యాలీ నిర్వహించి పూల బొకేతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 34 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని తీసుకున్నాడు.

నేడు ఒకే రోజు 2 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. మరో మూడు రోజుల్లో పూర్తి మొక్కలు నాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 తేదీ వరకు ఘనంగా నిర్వహించారన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటి పరిసరాలలో ఉన్న తొట్టిలో నీటిని నిల్వ ఉంచరాదన్నారు. అలా ఉంచినట్లయితే వాటి పై దోమలు ప్రభలి వ్యాధులు వ్యాప్తి చేసే అవకాశం అధికంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story