అది పల్లె ప్రకృతి వనమా.. ఖాళీ స్థలమా ?

by Sumithra |
అది పల్లె ప్రకృతి వనమా.. ఖాళీ స్థలమా ?
X

దిశ, మద్దూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం మొక్కల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపినప్పటికీ, కొందరు అధికారుల నిర్లక్ష్యం మూలంగా మొక్కలు గడ్డిలో కలిసిపోతున్నాయి. మద్దూరు మండలం మర్మాముల గ్రామంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి నిర్లక్ష్యం మూలంగా మొక్కలు ఎండిపోయి గడ్డి పెరగడంతో కంచెల మారింది. సర్పంచ్ 3 లక్షలు ఖర్చుపెట్టి బృహత్ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు పెట్టి పదవి ముగిసే వరకు కాపాడుకుంటూ వచ్చారు.

సర్పంచు పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో మొక్కలను కాపాడవలసి ఉండగా ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం మూలంగా మొక్కలు ఎండిపోయి కంచెలా మారిందని గ్రామస్తులు అనుకుంటున్నారు. బృహత్ పల్లె ప్రకృతి వణంలోని మొక్కల పై నిర్లక్ష్యం వహించి 3 లక్షల రూపాయల ప్రజాదనాన్ని గడ్డిపాలు చేసిన అధికారుల పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed