- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పంచాయతీతో వచ్చిన పంచాయితీ

X
అద్దే భవనంలోనే పంచాయతీ కార్యాలయం
ఏడాదిగా చెల్లించని అద్దే.. కార్యాలయానికి తాళం వేసి యాజమాని
గత్యంతరం లేక బయటే నిలబడిన సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి
దిశ, చౌటపూర్ : మండల పరిధిలోని మంత్రి గూడెం గ్రామ పంచాయతీ భవనానికి సంబంధించి ఇంటి యజమాని బుధవారం తాళం వేసింది. అయితే, తాళం వేయడం ఏంటని ఆశ్చర్యపోకండి ఆ పంచాయతీ భవనం అద్దె భవనం. ఏడాది నుంచి అద్దే చెల్లించకపోవడంతో, విషయాన్ని గత మూడు నెలలుగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దృష్టి తీసుకెళ్లిన వారు పట్టించుకోలేదు. దీంతో విసిగు చెందిన ఇంటి యజమాని బుధవారం పంచయతీ కార్యాలయానికి తాళం వేసినట్లు తెలిపారు. ఈ పరిణామంతో గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కార్యాలయం బయటే నిలబడవలసి వచ్చింది. అయితే, విషయం గ్రామ పెద్దలకు తెలియడంతో ఇంటి యజమానికి నచ్చజెప్పి కార్యాలయానికి వెసిన తాళం తీయించారు.
Next Story