అబద్దాల ఆడడంలో రేవంత్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే...! : హరీష్ రావు

by Kalyani |
అబద్దాల ఆడడంలో రేవంత్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే...! : హరీష్ రావు
X

దిశ, మెదక్ ప్రతినిధి : అబద్దాల అడడంలో సీఎం రేవంత్ రెడ్డి కి ఆస్కార్ ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.. ఆదివారం మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీ ఆర్ ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. మెదక్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు ఒక్కటి కూడా పనికొచ్చే మాటలు మాట్లాడలేదన్నారు. రాందాస్ చౌరస్తా కేసీఆర్ చేసిన పనికి నిదర్శనం. మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ఉన్న నాలుగు లైన్ ల రోడ్డు సైతం కేసీఆర్ ప్రభుత్వమే నిర్మించిన విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు.

ఇందిరాగాంధీ మెదక్ జిల్లా చేస్తా, కేంద్రం చేస్తామని మాట తప్పితే.. కేసీఆర్ జిల్లా ప్రజల కలను సాకారం చేశారని అన్నారు. మెదక్ జిల్లా అయింది కాబట్టే నామినేషన్ వేసేందుకు మెదక్ వచ్చావని, మెదక్ రప్పించిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. మెదక్ ప్రజల కష్టాలు తీర్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. వీటితో పాటు మంబోజి పల్లి బ్రిడ్జి, మూడు మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్ కదా అని ప్రశ్నించారు. ఏడుపాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇస్తే దాన్ని జీవో రద్దు చేసి డబ్బులు వెనక్కి తీసుకొని జిల్లాకి అన్యాయం చేశారని ఆరోపించారు. మెదక్ ప్రజల చిరకాల స్వప్నం రైల్వే కు 100 కోట్లు ఇచ్చి భూసేకరణ చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు.

ఇక్రిశాట్ ఇందిరా గాంధీ తెచ్చారా.. ప్రధాని చరణ్ సింగ్ ఇచ్చారని, ఇందిరా గాంధీ తెచ్చినదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు. సీఎం చైర్ లో కూర్చొని మాట్లాడే భాష ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి అడిగితే అక్రమ కేసులు పెడతారా... హామీ లు ఏమయ్యాయని ప్రజల కోసం ప్రతిపక్షంగా అడుగుతున్నాం అని అన్నారు. ప్రజలకు రైతులకు సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా రుణ మాఫీ చేశారా.. మాట మీద నిలబతావా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట రామిరెడ్డి ఇక్కడి స్థిర నివాసం ఉంది, కొడంగల్ నుంచి మల్కాజ్గిరి లో రేవంత్ రెడ్డి పోటీ చేయలేదా అప్పుడు స్థానికత్వం గుర్తుకు రాలేదా అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ని ఓడగోడతోనే హామీలు అమలు అవుతాయన్నారు. కాంగ్రెస్ మంత్రులకు అహంకారం నెత్తికి ఎక్కి విర్రవీగుతన్నారని, దాన్ని దించాలంటే వెంకట్ రామి రెడ్డి గెలవాలన్నారు. నా ఎత్తుతో ఏం అవసరం.. రైతులు పడుతున్న తిప్పలు కోసం ఆలోచించమన్నారు. రామాయంపేట లో 21 రోజుల్లో ఒక్క లారీ ధాన్యం పోయిందా.. అక్కడే కుప్పలా కాడ రైతులు ఇబ్బందులు పడుతున్నా కొనుగోలు చేసే దిక్కు లేదన్నారు. ఒక్క మంత్రి రైతు ను పరామర్శించారా.. ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం ఎక్కడుందని నిలదీశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రోజు కూడా తీరిక దొరకడం లేదా అని ప్రశ్నించారు.

వి. హన్మంతు రావుకు అపాయింట్మెంట్ దొరకడం లేదు కానీ, మా ఎమ్మెల్యేలను గుంజుకుంటా ఉన్నారన్నారు. నువ్వు టచ్ చేయాల్సింది ఆరు గ్యారెంటీ లను, దు ఖంలో ఉన్న రైతులను టచ్ చేయు.. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడాలి అని కోరారు. ఆరు గ్యారెంటీ లను వంద రోజుల్లో ఎందుకు అమలు చేయలేదని ఎన్నికల ప్రచారం లో చెప్పాలన్నారు. మెదక్ లో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ అభ్యార్థియేనన్నారు. మెదక్ పార్లమెంట్ లో అద్భుతమైన కాలుష్య రహిత డివైజ్ పార్క్ తెచ్చింది కేసీఆర్ అని తెలిపారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్ర గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story