పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి : జిల్లా రెవెన్యూ అధికారి

by Sumithra |
పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి : జిల్లా రెవెన్యూ అధికారి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మికిరణ్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మికిరణ్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి మే 4వ తేదీ వరకు ఓపెన్ 10వ తరగతి పరీక్షలు, ఏప్రిల్ 25 నుండి మే 3వ తేదీ వరకు, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు.

ఓపెన్ 10వ తరగతి పరీక్షలను 5 పరీక్ష కేంద్రాలలో మొత్తం 743 మంది విద్యార్థులు, ఓపెన్ ఇంటర్మీడియట్ 6 పరీక్ష కేంద్రాలలో 1122 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. మాస్ కాఫీయింగ్ కు తావు లేకుండా పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ వో శ్రీనివాస్, విద్యుత్తు శాఖ అధికారి మహేష్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed