అధికారులు సమన్వయంతో పని చేయాలి

by Naresh |
అధికారులు సమన్వయంతో పని చేయాలి
X

దిశ, నారాయణఖేడ్: అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం సిర్గాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ వేసవిలో నీటి సమస్య, విద్యుత్, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో సీసీ రోడ్డు వేయకుండా బిల్లులు శ్వాస చేశారని ,ఇప్పుడు ఇలాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయంలో వివిధ సర్టిఫికెట్లకు, భూములు రిజిస్ట్రేషన్ చేసుకొనే వారికి డబ్బులు వసూలు చేస్తున్నారని, అదే విధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమల పై త్వరలోనే కలెక్టర్‌తో వచ్చి వారి బండారం బయట పెడతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, వైస్ ఎంపీపీ, పంచాయతీ సెక్రెటరీలు. స్పెషల్ ఆఫీసర్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story