- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Surrogacy: మహిళ ప్రాణం తీసిన సరోగసీ
దిశ, వెబ్ డెస్క్: పెళ్లై ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా.. పిల్లలు పుట్టకపోతే.. ఆ దంపతులు సరోగసీని ఆశ్రయించవచ్చు. అంటే తమ బిడ్డను మరొకరు కని ఇచ్చే ఒప్పందం ఇది. కానీ ఈ మధ్యకాలంలో సరోగసీ పెద్ద బిజినెస్ అయిపోయింది. మాతృత్వపు అనుభూతిని పొందకుండానే తల్లులవుతున్నారు. పిల్లల్ని నవమాసాలు మోసి కంటే.. తమ అందం తగ్గిపోతుందని భావించేవారు కూడా సరోగసీ (Surrogacy)ని ఆశ్రయిస్తున్నవారిలో ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడిది పెద్ద బిజినెస్సే. సరోగసీకి వచ్చినవారికి లక్షలకు లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడా సరోగసీనే ఒక మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
సరోగసీ కోసం ఒడిశా నుంచి నెలరోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చింది పాతికేళ్ల వివాహిత అశ్విత సింగ్. సరోగసీ పిల్లల కోసం ఆ మహిళతో రాయదుర్గం (Raidurg)కు చెందిన 55 సంవత్సరాల రాజేశ్ ఒప్పందం చేస్తున్నాడు. బిడ్డను కని ఇచ్చేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి రాజేశ్ సదరు మహిళను బయటకు పోనివ్వకుండా ఇంటికే పరిమితం చేశాడు. ఏం జరిగిందో ఏమో గానీ.. ఆ మహిళ ఓ అపార్టుమెంటులోని 9వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. రాజేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.