మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారంః కలెక్టర్ రాహుల్ రాజ్

by Nagam Mallesh |
మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారంః కలెక్టర్ రాహుల్ రాజ్
X

దిశ, కౌడిపల్లి : బీసీ పాఠశాల, కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్థి సమగ్రాభివృద్ధికి అధికారులు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కౌడిపల్లి మండలం తునికి బీసీ గురుకుల పాఠశాల మరియు కళాశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంట గది, భోజన శాల, డార్మెంటరీ లను తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పాఠశాల, కళాశాలలో ఉన్న ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారి సమగ్ర అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదశించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని ప్రతి విద్యార్థికి అందించాలని, విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని సకాలంలో అందజేయాలని, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై రెగ్యులర్ గా చెక్ అప్ చేయాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరీక్షించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హరిబాబు అధ్యాపకులు, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed