Narayankhed MLA : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

by Aamani |
Narayankhed MLA : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
X

దిశ,పెద్ద శంకరంపేట: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే (Narayankhed MLA) సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని చీలపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (MLA) ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు.

పార్టీలకు రహితంగా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పెద్దశంకరంపేట మండల పరిధిలోని ఆయా గ్రామాలకు తండాలకు సీసీ రోడ్లు రహదారి నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు (CMRF) సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయిని మధు, ఆర్ఎన్ సంతోష్ కుమార్, అలుగుల సత్యనారాయణ, నారా గౌడ్, దాచ సంగమేశ్వర్, జనార్ధన్, పీఎసీఎస్ చైర్మన్ సంజీవరెడ్డి, పెరుమాండ్ల గౌడ్, తాసిల్దార్ గ్రేసీ బాయ్, ఆర్ఐ శరణప్ప, పీఎసీఎస్ సీఈఓ రవీందర్, ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చిలపల్లి పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే...

పెద్దశంకరంపేట మండల పరిధిలోని చిల పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నారాయణఖేడ్ ఎమ్మెల్యే (Narayankhed MLA) సంజీవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు.. పాఠశాలలో తాగునీటి ఎద్దడి నెలకొందని పలు సమస్యలను ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు వివరించగా సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో పలు అంశాలపై మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమార్, శ్రీనివాస్, ప్రమోద్, సంతోష్, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed