అంబులెన్స్‌లో దుబ్బాక బయలుదేరిన కొత్త ప్రభాకర్ రెడ్డి

by Sumithra |   ( Updated:2023-11-09 08:29:50.0  )
అంబులెన్స్‌లో దుబ్బాక బయలుదేరిన కొత్త ప్రభాకర్ రెడ్డి
X

దిశ, మనోహరాబాద్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. దుబ్బాక లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి గురువారం ప్రత్యేక అంబులెన్స్ లో డాక్టర్ల పర్యవేక్షణ మధ్య ఎంపీ ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బయలుదేరారు. కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు.

ఎంపీ ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్ లోనే ఉండగా పూజారులు ప్రభాకర్ రెడ్డి పేర ప్రత్యేక అర్చన, పూజలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు నాయకులు ఆయనకు తిలకం దిద్ది మంగళహారతి ఇచ్చారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని నాయకులు బంగారమ్మ దేవతను వేడుకున్నారు. అనంతరం ఎంపీ దుబ్బాక వెళ్లిపోయారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ వేసే కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో గజ్వేల్ కు తరలి వెళ్లారు.

Advertisement

Next Story