- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సొంత డబ్బులతో ఎల్లమ్మ తల్లి ఆలయానికి MLA రఘునందన్ రావు అభివృద్ధి
దిశ, మిరుదొడ్డి: సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లి - మల్లుపల్లి మార్గ మధ్యలో ఓ చెట్టు కింద రేణుక ఎల్లమ్మ తల్లి వెలసింది. రేణుక ఎల్లమ్మ మహిమ గలదని నమ్మకంతో నిత్యం ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించి మొక్కు తీర్చుకుంటుంటారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో మల్లుపల్లి గ్రామ ప్రజలు స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావును ఆశ్రయించి పరిస్థితిని వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన తన సొంత నిధులతో ఎల్లమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. అందులో భాగంగా దేవాలయంతో పాటు దేవాలయ ప్రాంగణంలో భక్తుల కోసం 5 గదులతో పాటు కార్యాలయం నిర్మిస్తున్నారు. తాజాగా ఆ పనుల పురోగతిని పరిశీలించడానకి శనివారం ఎమ్మెల్యే రఘునందన్ రావు అక్కడికి వచ్చారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎలుముల దేవరాజు, నాయకులు మల్లన్న గారి భిక్షపతి తదితరులు ఉన్నారు.