ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి బీఆర్ అంబేద్కర్ కారకుడు : ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Vinod kumar |   ( Updated:2023-01-26 11:55:02.0  )
ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి బీఆర్ అంబేద్కర్ కారకుడు : ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, చేగుంట: భారతదేశ ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కారకుడని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఇబ్రహీంపూర్ గ్రామ ఎంపీటీసీ భాగ్యమ్మ నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బహుమతుల అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేడు సమాజంలో స్వేచ్ఛాయుతంగా జీవిస్తున్నామంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణమన్నారు.

రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజున గణతంత్ర దినోత్సవం గా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో కెల్లా భారతదేశంలోని 'రాజ్యాంగం' చాలా గొప్పదన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు వారికి ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా చూడాలన్నారు. ఇబ్రహీంపూర్ ఎంపీటీసీ భాగ్యమ్మ నాగభూషణం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషం అన్నారు. అనంతరం విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, సర్పంచ్ దూరగొల్ల రాములు, విద్య కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: 'రాజ్యాంగానికి ప్రతిరూపం బీఆర్ అంబేద్కర్‌' : ఎమ్మెల్యే రఘునందన్ రావు

Advertisement

Next Story