- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఉపాధి హామీ కూలీల మృతి.. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క దిగ్భ్రాంతి..

దిశ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని గోవర్ధనగిరిలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మృతి చెందారు. కాగా తీవ్రంగా గాయపడిన స్వరూపను మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. కాగా ఈ ఘటన పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్కలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాల పై జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఇద్దరి మరణానికి కారణమైన విషయం పై జిల్లా అధికారులతో విచారణకు ఆదేశించారు.
గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. మరణించిన, గాయపడిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఘటన వార్త తెలిసిన వెంటనే మంత్రి సీతక్క అధికారులతో మాట్లాడి వివరాలు తెప్పించుకున్నారు. ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ఆ ప్రాంతంలో పనులు చేయొద్దని జిల్లా అధికారులు వారం రోజుల క్రితమే హెచ్చరించినా పనులు కొనసాగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై అధికారులతో సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆదేశించారు.