- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యోగా జీవన విధానంలో భాగం కావాలి.. మంత్రి.హరీష్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : యోగా జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేట జయశంకర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరై యోగ సాధన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యోగా సాధనతో దీర్ఘకాలిక వ్యాధులైన షూగర్, బీపీలకు చెక్ పెట్టవచ్చు అన్నారు. మెడికల్ కాలేజీలల్లో వైద్య విద్యార్థులు యోగా క్లాస్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ అసుపత్రులల్లో గర్బనీలకు ప్రాణాయామం, యోగాసాధన చేస్తున్నట్లు తెలిపారు. వ్యాధి బారిన పడిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమన్నారు. ప్రపంచ దేశాల ప్రజలు యోగా గొప్పదనం తెలుసుకొని సాధన చేస్తున్నారన్నారు. సిద్దిపేట నియోజక వర్గ పరిధిలోని ప్రతి వార్డు, గ్రామాలల్లో యోగా శిక్షణ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హరిత హారం కార్యక్రమంతో తెలంగాణలో 7.4 శాతం గ్రీనరీ పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, యోగ సోసైటీల ప్రతినిధులు తోటఆశోక్, బొజ్జ ఆశోక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.