- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగా హారతిలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
గంగా మాతకు ప్రత్యేక పూజలు, హారతి
దిశ, జహీరాబాద్: మంజీరా గరుడ గంగా కుంభమేళాలో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతిలో పాల్గొని గంగా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి నిర్వహించారు. ఆలయ పీఠాధిపతి కాశీనాథ్ బాబాతోపాటు ఇతర మఠాలకు చెందిన పీఠాధిపతులు, సాధుసంతులు, దిగంబర, నాగ సాధువులు ఊరేగింపుగా తరలివచ్చి గంగ హారతిలో పాల్గొన్నారు.
ఊరేగింపు సందర్భంగా వేలాది మంది భక్తులు, ఆటపాటలతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించి మంజీర తీరానికి తరలివచ్చారు. గంగ హారతిలో పాల్గొన్న మంత్రి పంచవటిలోని దేవత మూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం న్యాల్కల్ మండలం కాకి జనవాడలో ఏర్పాటుచేసిన తెలుగు తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరించారు.
ఆయా కార్యక్రమాల్లో మంత్రితోపాటు జహీరాబాద్ ఎమ్మెల్యే కె.మాణిక్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, టీఎస్ ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీటీసీ స్వప్న భాస్కర్, మైనారిటీ కమిషన్ సభ్యులు ఎండీ.తన్వీర్, బీఆర్ఎస్ జహీరాబాద్ మండలాధ్యక్షులు, ఎంఆర్ఎఫ్ కార్మిక సంఘం అధ్యక్షులు హుగ్గెల్లి రాములు, బీఆర్ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు, ప్రతినిధులు, నాయకులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు, తదితరులు పాల్గొన్నారు.