- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవకాశాలను అందిపుచ్చుకోవాలి.. మంత్రి హరీష్ రావు..
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఉద్యోగార్థులు అవకాశాలను అందింపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అదిరోహించాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో స్థానికులకే స్థానిక ఉద్యోగాల పేరిట 15 ఐటీ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోగా జాబ్ మేళాను మంత్రి హరీష్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్ధిపేట బిడ్డలకు సిద్ధిపేటలోనే ఉద్యోగాలు చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని జిల్లాలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఐటీటవర్ రావడం సంతోషంగా ఉందన్నారు.
రూ.63 కోట్ల వ్యయంతో 718 సిట్టింగ్ కెపాసిటీతో నిర్మించిన ఐటీటవర్ లో ప్రముఖ ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఐటీ టవర్ ను ఈ నెల 15న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. ఉద్యోగార్థులకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ అందిస్తామన్నారు. టాస్క్ శిక్షణ పొందిన తర్వాత ఎక్కడైనా ఐటీ, తదితర రంగాలలో ఉద్యోగ అవకాశాలు పొందే వీలు ఉంటుందన్నారు. ఇప్పటికే సిద్ధిపేట విద్యా క్షేత్రంగా నిలిచిందని, ఇవాళ్టి నుంచి ఉద్యోగాల హబ్ గా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణు గోపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.