సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పుతుంది.. ఎంపీ మాధవనేని రఘునందన్ రావు

by Sumithra |
సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పుతుంది.. ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి పాలన గాడి తప్పినట్లు ఉందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవన్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. హైడ్రా చట్టంలో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేయడాన్ని తప్పుబట్టారు. హైడ్రాను రాజకీయాల కోసం వాడొద్దని, ప్రకృతి వనరుల పరిరక్షణ కోసం వాడాలన్నారు. ఎంఐఎం పార్టీ మెప్పు కోసం గణేష్ ఉత్సవాల సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు ఉండదన్నారు. కుటుంబ పార్టీలకు భిన్నంగా కార్యకర్తను నాయకుడిని చేసే పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు.

ఏడు దశాబ్దాలుగా ఎవ్వరు సాహసించని విధంగా నేటి పరిస్థితులకు అనుగుణంగా భారత న్యాయ సంహిత కొత్త చట్టలను తీసుకొచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వంలో విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని తెలిపారు. బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి న్యాయవాదులు ముందుకు రావడం దేశ రాజకీయాలకు సంకేతం అని అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ బీజేపీ సభ్యత్వం ప్రధాని నరేంద్ర మోడీని బలపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నాయకులు బాలేష్ గౌడ్, సుభాష్ చందర్, బైరి శంకర్, గురువా రెడ్డి, ఉపేందర్ రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story