- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
దిశ,తూప్రాన్ : తూప్రాన్ డివిజన్ పరిసర ప్రాంతం లో ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా బెట్టింగ్ వ్యాపారం చాపకింద నీరులా పాకుతుంది. ఊరి బయట ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. మరికొందరు క్రికెట్ మ్యాచ్లను లైవ్లో చూస్తూ, బెట్టింగ్ కి పాల్పడుతున్నారు. బ్రోకర్ లు మధ్యవర్తుల ల ద్వారా ఫోన్ ద్వారా బెట్టింగ్లలో డబ్బులు పెడుతున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ల నిర్వాహకులు, బ్రోకర్లు, బెట్టింగ్లకు పాల్పడే వారంతా ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. ముందస్తు ఒప్పందంలో భాగంగా మొబైల్ నెంబర్లు నమోదు చేసుకుని బెట్టింగ్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.
కొందరు వికెట్ల చొప్పున, బంతి, బంతికి బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. మ్యాచ్లో తలపడే జట్టులో ఫలానా జట్టు టాస్ గెలుస్తుందని, ఫలానా జట్టు బ్యాటింగ్ తీసుకుంటుందని బెట్టింగ్ సైతం వేస్తున్నారు. ఈ బెట్టింగ్లో ఒకటికి రెండింతలు చెల్లించే పద్ధతిని పాటిస్తున్నారు. ఒక్కో సందర్భంలో బెట్టింగ్ కు పాల్పడే మొత్తానికి రేషియో ఇస్తూ అదనంగా చెల్లింపులు సాగిస్తున్నారు. ఒక్కోసారి 5 నుంచి 10 రెట్ల వరకు బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. రూ. 10,000 పెడితే…గెలిస్తే రూ.30,000 వేలు వస్తాయని ఆశ చూపి యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగుతున్నారు. ఇలా అత్యాశకు పోయి ధనవంతులు, పేద,మధ్యతరగతి అనే తేడా లేకుండా యువకులు లక్షల్లో పందాలు కాస్తూ కొందరూ అప్పుల పాలవుతున్నారు. మరికొందరూ దండుకుంటున్నారు.
అంతా చరవాణుల్లోనే, యాప్ ద్వారా పేమెంట్స్ .
అయితే ఇదంతా చరవాణుల్లోనే బయటకు తెలియకుండా జరుగుతోంది. వీటికి వేదికలుగా ఆన్లైన్ పేమెంట్ విధానంలో వివిధ యాప్ ద్వారా డబ్బులు బదిలీ చేసుకుంటున్నారు. ఇష్టమైన జట్లను ఎంచుకుని పందెం డబ్బులను మధ్యవర్తికి బదిలీ చేస్తారు. ఆ తర్వాత గెలిచిన వారికి మధ్యవర్తి కమీషన్ తీసుకుని ఇస్తారు. కొందరు నేరుగా కూడా బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. పెట్టిన సొమ్ము ఎప్పటికప్పుడే ఇచ్చిపుచ్చుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకున్నా ఎవరికీ బయటకు చెప్పుకోవడం లేదు. యువత దీనికి ఎక్కువగా అలవాటు పడుతోంది. ఇందుకు అప్పులు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు.
అదిలోనే నిర్ములంచకపోతే ముప్పే
దీనిని అరికట్టకపోతే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. సరదాగా ఆడిన పందేలు వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో పిల్లలపై వారి కుటుంబసభ్యులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వారిని అటువైపుగా వెళ్లకుండా నియంత్రించాలి. బెట్టింగుల వల్ల కలిగే నష్టాలను వివరించాలి. ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి. పోలీసు యంత్రాంగం కూడా దీనిపై ప్రత్యేక దృష్టిసారించి, నిర్మూలించేందుకు అవగాహన కల్పించాల్సి ఉంది...