సంగారెడ్డిలో రెండు ప్రైవేటు ఆసుపత్రుల ల్యాబ్స్ సీజ్...

by Aamani |
సంగారెడ్డిలో రెండు ప్రైవేటు ఆసుపత్రుల ల్యాబ్స్ సీజ్...
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: ప్రైవేటు ఆసుపత్రులలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రి దేవి హెచ్చరించారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గాయత్రీ దేవి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సంగారెడ్డి బైపాస్ రోడ్ లోని శిశు రక్ష హాస్పిటల్ లో తనిఖీలు నిర్వహించగా శిశు రక్ష హాస్పిటల్ వారు తమ దగ్గర పనిచేయుచున్న డాక్టర్ల వివరాలు, పేషెంట్ల వద్ద వసూలు చేస్తున్న ధరల పట్టికను రిసెప్షన్ వద్ద ప్రదర్శించడం లేదని అలాగే ల్యాబ్ లో రాపిడ్ కార్డ్ టెస్ట్ లో డెంగ్యూ జ్వరం పాజిటివ్ వచ్చినా అది నిర్ధారణ చేయకుండా సెకండ్ శాంపిల్ ఎలిసా టెస్ట్ కు తెలంగాణ డయాగ్నస్టిక్స్ కు కానీ ఏదైనా పెద్ద డయాగ్నస్టిక్స్ కు పంపించి అక్కడ ఎలిసా టెస్ట్ లో పాజిటివ్ వచ్చినప్పుడు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ చేయాలి.

కానీ వారు రెండోసారి శాంపుల్ ఎలిసా టెస్ట్ కు పంపియకుండా డెంగ్యూ పాజిటివ్ అని నిర్ధారణ చేసి పేషంట్లకు భయభ్రాంతులకు గురి చేయుచున్న కారణంగా హాస్పిటల్ లోని ల్యాబ్ ను సీజ్ చేశారు. అలాగే సంగారెడ్డి చౌరస్తా లో గల చరిత హాస్పిటల్ సందర్శించగా హాస్పిటల్ లో సరైన పరిశుభ్రత పాటించకపోవడం, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల, ఆసుపత్రిలో సరైన ఫైర్ సేఫ్టీ సిస్టం లేకపోవడం, ల్యాబ్ లో రికార్డ్స్ సరిగా మెయింటెన్ చేయకపోవడం కారణంగా ల్యాబ్ ను సీజ్ చేశారు. వారికి నోటీసు ఇచ్చారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు, ల్యాబ్ నిర్వాహకులకు తమ సంస్థలలో పేషెంట్లకు ఇస్తున్న సర్వీసులు, వాటికి తీసుకుంటున్న చార్జీలు రిసెప్షన్లో ప్రదర్శించాలని, మీ దగ్గరికి వస్తున్న డాక్టర్ల వివరాలు, వారి చార్జీలు హాస్పిటల్ డిస్ప్లే లో లేనియెడల అలాంటి ప్రైవేటు వైద్య సంస్థలపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీ ఎం అండ్ హెచ్ ఓ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed