- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేవీపీఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
దిశ, సంగారెడ్డి: కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులుగా అతిమేల మానిక్, జిల్లా కార్యదర్శిగా పి.అశోక్, ఉపాధ్యక్షులుగా యువ న్యాయవాది సుభాష్, మద్దూరి శివకుమార్, సంతోష్, సహాయ కార్యదర్శులుగా ప్రవీణ్, మల్లేశం, దాస్, జిల్లా కమిటీ సభ్యులుగా దత్తు, చంద్రశేఖర్, గంగారం, మోసప్ప, కృష్ణ, శ్రీనివాస్, వెంకటేష్, నరేష్, శేఖర్, జయరాం, బాబురావు, అరుణ్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎ. మానిక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకు ఐక్యంగా ఉద్యమించాలని అన్నారు. ఏప్రిల్‌లో మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ వంటి మహనీయుల ఆశయాలు ప్రజల్లోకి వెళ్లేందుకు కరపత్ర ప్రచారం, మోటార్ సైకిల్‌ల ర్యాలీలు నిర్వహింాలని, పూలే - అంబేడ్కర్ జన జాతర కార్యక్రమాలను అన్ని తరగతులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పి. అశోక్, ఉపాధ్యక్షులు యువ న్యాయవాది సుభాష్, మద్దూరి శివకుమార్, సంతోష్ ,సహాయ కార్యదర్శులు ప్రవీణ్, మల్లేశం, దాస్, జిల్లా కమిటీ సభ్యులు దత్తు చంద్రశేఖర్ గంగారం, మోసప్ప, కృష్ణ శ్రీనివాస్, వెంకటేష్, నరేష్ శేఖర్ జయరాం, బాబురావు ,అరుణ్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి కార్యకర్తలు పాల్గొన్నారు.