- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముక్కు మూసుకోవాల్సిందే..ఆదాయం ఉన్నా.. సౌకర్యాలు అంతంతే?
దిశ, హుజురాబాద్ రూరల్: హుజూరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ పారిశుద్ధ్యం లోపించి కంపు కొడుతుంది. బస్టాండ్ కి వచ్చే ప్రయాణికులకు బస్టాండ్ లోపల ఇరుపక్కల ఉన్న టాయిలెట్స్ సక్రమంగా లేక దుర్వాసనతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయల మార్కెట్ కి వెళ్లే రహదారిలో అంబేద్కర్ భవన్ ఖాళీ స్థలంలో కొందరు మల, మూత్రం విసర్జించడం వల్ల దుర్గంధం వెదజల్లుతుంది. హుజూరాబాద్ బస్టాండ్ కు ప్రతిరోజు వందల సంఖ్యలో వరంగల్, కరీంనగర్ ,నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు నిత్యం బస్సులు నడుస్తూ ఉంటాయి. వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎంతో రద్దీగా ఉండే బస్టాండ్ లో దుర్గంధంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మూత్రశాలలు సక్రమంగా లేకపోవడం తో ప్రయాణికులు అంబేద్కర్ భవన స్థలంలో ,పరిసర ప్రాంతాల్లో ఆరుబయటనే "పని" కానిస్తున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా బస్టాండ్ కు ఆదాయం ఉన్నా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.
కానరాని పారిశుద్ద్యం..
బస్టాండ్ లోకి బస్సులు లోపలికి వెళ్లే ప్రాంతంలో నిర్మించిన ఈ టాయిలెట్స్,బస్టాండ్ లోపల ఉన్న టాయిలెట్స్ దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఈ టాయిలెట్స్ నిర్వహణ సక్రమంగా లేక టాయిలెట్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆరుబయట మూత్రం కానిస్తుండడంతో దుర్గంధం వస్తుంది. పరిసరాల్లో చెత్తాచెదారం నిల్వలు ఉంటున్నాయి.మార్కెట్ రోడ్ నుండి ప్రయాణికులు వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. ప్లాస్టిక్ వ్యర్ధాలు,మక్కా కంకుల బెడ్లు, పొట్టు, ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. డస్ట్ బిన్ లు ఎక్కడ ఏర్పాటు చేయకపోవడంతో చెత్తాచెదారం చెల్లాచెదురుగా ఉంటుంది. ప్రయాణికులకు మూత్రశాలలు ఉన్న నిర్వాహణ లేక అధ్వాన్నంగా మారాయి.
చర్యలు తీసుకుంటాం..: రవీంద్రనాథ్, డిపో మేనేజర్
బస్టాండ్ పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి. పారిశుధ్యం ఎక్కడ లోపించిందో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.