- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ కుటుంబం దోచుకుంది...దాచుకుంది....
దిశ, గజ్వేల్ / కొండపాక : త్యాగాల తెలంగాణలో బోగాలు అనుభవించిన కేసీఆర్ కుటుంబం దోచుకుంది...దాచుకుంది అని, కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతుందని డీసీసీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆరోపించారు. శనివారం గజ్వేల్ రైతు వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ అమలు చేస్తుండగా, రూ. రెండు లక్షల రైతు రుణమాఫీ విషయంలో కల్లు తాగిన కోతిలా మాట్లాడుతూ హరీష్ రావు, కేటీఆర్ లు రోడ్డున పడినట్లు ఎద్దేవా చేశారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతుల రుణమాఫీ కాకపోగా, వాటిని సైతం సరి చేయాలని వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులతో ప్రజలు తమపై తిరగబడతారనే భయంతో రెచ్చగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, అయితే వారి సభల్లో రైతులు కాకుండా కేవలం బీఆర్ఎస్ నేతలే ఉంటున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు పిచ్చివాగుడు మానకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. గత పదేళ్ల వ్యవధిలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప వారు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కృషి చేస్తుండగా, ప్రస్తుత రాష్ట్ర ఆదాయం కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న రుణాల మిత్తికి సరిపోతున్నట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నిండా ముంచినట్లు ఆ పార్టీ నేతలకు తెలిసినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడం తగదని సూచించారు.
లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత జైలు జీవితం అనుభవిస్తున్నప్పటికీ ఇంకా వారి పద్ధతి మార్చుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి హామీని అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఆయా మండలాల బాధ్యులు శ్రీనివాసరెడ్డి, తమ్మలి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, రవీందర్ రెడ్డి, లింగారావు, కిష్టాగౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నేతలు సుభాష్ చంద్రబోస్, సమీర్, షరీఫ్, సర్దార్ ఖాన్, రామచంద్ర చారి, గాడిపల్లి శ్రీనివాస్, జహీర్, కన్నా యాదవ్, రమేష్ గౌడ్, అంజాగౌడ్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.