కేతకిలో హుండీ లెక్కింపు.. రద్దయిన పాత 2 వేల నోట్లు ప్రత్యక్షం

by Aamani |
కేతకిలో హుండీ లెక్కింపు.. రద్దయిన పాత 2 వేల నోట్లు ప్రత్యక్షం
X

దిశ,ఝరాసంగం : అష్ట తీర్థాల సంగమం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 45 రోజులకు గాను రూ. 19,50,801 లక్షల ఆదాయం వచ్చింది. తెలుగు రాష్ట్రాల కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకల రూపంలో స్వామి వారి హుండీ లో వేసిన నగదు, నాణేలు లెక్కించారు. హుండీలో రద్దయిన 2వేల నోట్లు 3 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి కి చెందిన 112 మంది భక్తులు, అర్చక సిబ్బంది, భక్తులు లెక్కింపుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు రచన్న స్వామి దేవస్థానం ఈఓ శివరుద్రప్ప, కేతకి ఆలయ ఈవో శశిధర్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story