- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల కష్టాలు తీర్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ : ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
దిశ, జగదేవపూర్ : తొమ్మిదేళ్ల కాలంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి బీడు భూములకు సాగునీరందించి రైతుల కష్టాలు తీర్చిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని మునిగడప, చాట్లపల్లి, తీగుల్, ఇటిక్యాల, జగదేవపూర్, తిమ్మాపూర్ రైతు వేదికల వద్ద రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇటిక్యాలలో రైతు వేదిక వద్ద నిర్వహించిన రైతు దినోత్సవ కార్యక్రమానికి ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తుందన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల రైతు వేదిక క్లస్టర్లలో పండగ వాతావరణం నెలకొందని తెలిపారు. గ్రామాల్లో పేదవాళ్లు ఇల్లు కట్టుకున్నట్లయితే వారికి ప్రభుత్వం తరుపున రూ.3 లక్షలు అందజేస్తామని తెలిపారు.
ఆయా గ్రామాల్లో రైతు వేదికల వద్ద ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీఏసీఏస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, బీఆర్ఏస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సర్పంచ్ లు ఫోరం మండలాధ్యక్షుడు రాచర్ల నరేష్, రావికంటి, చంద్రశేఖర్, పీఏసీఏస్ డైరెక్టర్లు భూమయ్య, గుర్రం శ్రీనివాస్, ఏవో వసంతరావు, ఏఈవో భాను సర్పంచ్ లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.