Rains: సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

by Mahesh |
Rains: సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద
X

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా రాత్రి 10.00 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున వాన పడిన దాఖలాలు లేవని పలువురు తెలిపారు. అత్యధికంగా సంగారెడ్డి మండలంలో 6.55 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టు (Singur Project)కు వరద పోటెత్తింది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 29.917 TMCలు కాగా ప్రస్తుతం 24.423 టీఎంసీలకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 44197 క్యూసెక్కుల నీరు వస్తుంది. ఔట్‌ప్లో కేవలం 401 క్యూసెక్కులు మాత్రమే. అదే విధంగా సంగారెడ్డి మండల పరిధిలో ఉన్న మంజీర బ్యారేజీ (Manjira Barrage)కి వరద ప్రవాహం పెరిగింది. బ్యారేజీ సామర్థ్యం 1.50 టీఎంలు కాగా పూర్తిగా నిండిపోవడంతో బ్యారేజీ గేట్లు ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు. సుమారు 3100 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అదే విధంగా జిల్లాలోని పెద్ద వాగులు గంగకత్వ, పెద్దపూర్ చెరువు, మల్కాపూర్ చెరువులు పూర్తిగా నిండిపోయి కిందకు ప్రవహిస్తున్నాయి.

జిల్లాలో కురిసిన భారీ వర్షం వివరాలు..

సంగారెడ్డి‌లో అత్యధికంగా 6.55 సెంటీమీటర్లు, ఝరాసంగం 5.6 సెంటీమీటర్లు, కంది 5.38 సెం.మీ, రాయికోడ్ 5.2 సెం.మీ, న్యాల్ కల్ 4.55 సెం.మీ, పుల్ కల్ 4.51 సెం.మీ, అమీన్ పూర్ , జిన్నారంలలో 4.4 సెం.మీ, సదాశివపేట 4.1 సెం.మీ, కొండాపూర్ 3.68 సెం.మీ, మునిపల్లి 3.17 సెం.మీ, జహీరాబాద్ 2.85 సెం.మీ, వట్ పల్లి 2.63 సెం.మీ, కోహీర్ 2.57 సెం.మీ, మొగుడంపల్లి 2.43 సెం.మీ, చౌటకూర్ 2.2 సెం.మీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా కంగ్టి, హత్నూర, కల్మేర్ మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సంగారెడ్డి మండలంలో 6.55 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed